17 March, 2026 | 5:09 AM

హామీలు నెరవేర్చాలని వినతి

17-03-2026 01:10 AM

మంచిర్యాల టౌన్, మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, మీ పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం తహశీల్దార్ రఫాత్‌ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్, గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు బోట్ల సత్యనారాయణ, 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, 13వ డివిజన్ ఇంచార్జి ములుకాల కుమార్, గర్మిళ్ల జోన్ ఎస్సి మోర్చా అధ్యక్షుడు బింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్రె లచ్చన్న, మెట్టుపల్లి జయరాం రావు, వైద్య శ్రీధర్, అంకం మనోజ్, నాంపల్లి శ్రీను, రాజేంద్రప్రసాద్ లతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.