7 April, 2026 | 3:45 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఫోన్..

07-04-2026 01:58 AM

రాంచందర్‌రావుకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన నితిన్

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సోమవారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ తెలంగా ణ రాష్ట్రంలో బలోపేతమై రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని, పార్టీ కార్యకర్తలు.. నాయకులు ప్రజల వద్దకెళ్లి ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యా మ్నాయంగా ఎదుగుతుందని, రాబోయే రోజు ల్లో అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం జాతీయ పార్టీకి ఉందన్నారు.