13 July, 2026 | 5:13 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

శిక్షణతోనే ఉత్తమ నాయకత్వం..

11-02-2026 12:00 AM

కాష్ఠమివ హి ఘుణజగ్ధం రాజకులమవినీత

పుత్రమభియుక్తమాత్రం భజ్యేత..

(కౌటిలీయం) రాజపుత్రులను స్వేఛ్చగా భోగా లు అనుభవించనీయడం అం టే బతికి ఉండగానే మరణింపచేయడమే అంటారు, ఆచార్య చాణక్య. పురుగులు తొలచిన కర్రవలె, విద్యాభ్యాసాల ద్వారా వినయాదులు నేర్వని రాజకుమారులు గలిగిన రాజ్యం.. శత్రువులు ఆక్రమించిన మా త్రాన కూలిపోతుంది. సరైన సమయంలో రాజకుమారులకు ఆయా విద్యల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా సకల విద్యల ను నేర్పించాలి, అంటారాయన.

అలా శిక్ష ణ పొందిన నాయకులు గాంఢాంధకారా న్ని రూపుమాపుతూ, రాత్రికి వీడ్కోలు పలి కి.. లేలేత కిరణాలతో పగటి తేజానికి స్వాగతం పలుకుతూ తూర్పున ఉదయిం చే బాలభాస్కరునిలా జాతికి మార్గదర్శన చేయగలుగుతారు. సాధారణంగా ప్రతివ్యక్తీ తన జీవితాన్ని ప్రయోజన భరితంగా, శాంతియుతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా నిర్వహించాలనే కోరుకుంటాడు.

జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే జీవితంలో కొన్ని జోడింపులు, తొలగింపులు, మార్పులు చేర్పులు, సరిచేసుకో వడాలు అవసరం. వాటిని సాకారం చేసుకోవడం, వినడం, పరిశీలించడం, చర్చించ డం, ఆలోచించడం వల్ల సాధ్యపడుతుంది. విశిష్ట వ్యక్తుల బోధలను వినడం, నిశబ్దం గా చుట్టూ ఉన్న ప్రకృతిని, ఉన్నతమైన వ్యక్తుల అలవాట్లను పరిశీలించడం, విజ్ఞానవేత్తలతో చర్చించడం,

మన సహజ ప్ర కృతి ఆధారంగా ఆలోచించడం వల్ల ఉన్నతస్థితికి చేరడం సాధ్యపడుతుంది. దానికి కావాల్సింది సృజనాత్మకత, నిబద్ధత, సన్నద్ధత. సృజనాత్మకత అంటే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన కొత్త మార్గాలను అన్వే షించడం.. నిబద్ధత అంటే అంకితభావం తో, బాధ్యతాయుతంగా, నియమానుసారంగా నిలిచే కార్యశీలత కాగా ఏ సమస్యనైనా ఎదుర్కొనేందుకు నిలిచే విధానం సన్నద్ధత.

నాయకుల తయారీ..

నిజానికి విజయపథాన నడవాలనుకునే వ్యక్తులు లేదా సంస్థలు ప్రతిస్థాయి లోనూ నాయకులను తయారు చేసుకుంటాయి. రేపటితరం కోసం సమర్థులైన నా యకులను తయారు చేసుకోవడమే ఈ తరం నాయకుల కర్తవ్యం, బాధ్యత. ప్రతి ఉద్యోగిలో ఉండే సహజమైన సామర్ధ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఉపయోగించు కోవడం వల్ల సంస్థ ప్రగతిపథం లో నడుస్తుంది.

స్వయంకృషి కలిగిన నాయకుడు తన సహచరులను వివేకవంతులను చేస్తా డు, వారికి సహాయపడతాడు, వారిని ఉద్ధరిస్తాడు, తన ఆశయాలను ఆచరణలో చూపుతాడు. అంతేకాదు, వివేకంతో ఆలోచించమని ప్రబోధిస్తాడు. వివేకమంటే ఏం జరిగిందో దాన్ని అంగీకరించడం, అలాగే ఏం జరగలేదో దాన్ని గూర్చి ఆలోచించకపోవడం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని మార్లు ఫలితం రాకపోవచ్చు.

అప్పుడు ఓపికతో, సహనంతో సమయం కొరకు వేచి చూడడమే వివేకం. చేస్తున్న పనిలో అపజయం పలకరిస్తే ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదా గెలవాలని పట్టుదలతో ప్రయత్నించడం ఈ రెంటిలో దేనిని ఎన్నుకుంటామో అదే జీవన గమనమౌతుంది. 

నాయకత్వ లక్షణాలు..

జీవన ప్రయాణంలో అడ్డంకుల సముద్రమే కాదు అవకాశాల వారధి కూడా మనముందు ఉంటుంది. చూడగలిగినలో చూపు కావాలి. జీవన గమనంలో ఎదురయ్యే ఒడుదొడుకుల్లో మనమెలా ప్రవర్తి స్తామో అదే మన శ్రేష్ఠతను నిర్ణయిస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జన: స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే! అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. సమాజంలో శ్రేష్ఠులైన వారు లేదా గొప్పవారు ఎలా ప్రవర్తిస్తే అలాగే సాధారణ ప్రజలూ ప్రవర్తిస్తారు.

శ్రేష్ఠతా సాధనలో అవకాశాలకై ఎదురుచూడడం కన్నా వాటిని వెతుకుతూ వెళ్లడమే ఉత్తమం. శ్రేష్ఠత అంటే సాధారణమైన పనులను అసాధారణంగా చేయడం శ్రేష్ఠత అనబడుతుంది. ఆ శ్రేష్ఠ తా సాధనలో నాణ్యత, సంపూర్ణత, నిర్దుష్టత, కచ్చిత త్వం, పరిశుద్ధత, సార్ధకత, వ్య యనియంత్రణ, సరళత, సమయపాలన, విశ్వ సనీయ త, స్పష్టత అవసరమవుతాయి. వీటిని సాధించే సాధకునికి దార్శనికత, సమున్నత విలువలు లక్ష్యాలతో ఏర్పడిన కార్యాచరణ ప్రణాళిక.. ఈ రెండూ ఊపిరి లాం టివి. దార్శనికత అసాధ్యము అనుకు న్న దానిని సుసాధ్యంగా ఊహించడం..

కాగా దర్శించిన దానిని సాకారం చేసుకోవడం ఒక మిషన్. సంకల్పం, ఆలోచన, ప్రణాళిక, ఆచరణ బలమైన నాయకత్వ పటిమకు ప్రతీక లు. బలమైన సంకల్పం కావాలి అంటే తపన, ఉత్సాహం, ఆరాటం, ఆవేదన, సంవేదన, శ్రద్ధ, పట్టుదల, నిష్ఠ, నియమ జీవనం కావాలి. దీక్షాదక్షతాపూర్ణ కార్యాచరణ, ప్రణాళికాబద్ధ ప్రయత్న శీలత... ఉన్నచోట విజయం ఉంటుంది. పరస్పర అంగీకారం, సహాయం, సత్సంకల్పం, ప్రయత్నశీలతలు.. బాధ్యతగలిగిన నాయకత్వపు విశిష్ట లక్షణాలు అంటుంది గీత.

ఉత్తమ ఫలితాలు..

సాధారణ స్థాయి నుంచి వ్యక్తి జాత్యంతరీకరణ పొందితే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కాగలుగుతాడు. జాతి అంటే స్థాయి, అంతరీకరణ అంటే స్థాయిని అధిగమించడం. పదార్ధస్థితి, ప్రాణస్థితి, జంతు స్థితి (నేను మనుష్యస్థితి (నీవు సమగ్రస్థితి (నీవు మనము), ఋషిస్థితి (ప్రపంచంతో మమేకం), దేవస్థి తి చివరగా మహత్ స్థితి.. ఇవి ఒకదాని క న్నా మరొకటి ఉన్నతమైనవి.

సమగ్రత, దార్శనికత, దైవత్వం, శూన్యతలు వ్యక్తిమత్వానికి ప్రతీకలు.. విలువలతో కూడిన వ్యక్తిత్వమే వ్యక్తిమత్వం. దానిని సాధించే క్రమంలో నాయకుడు దయాగుణంతోనే ఉన్నా.. తన అధికారాన్ని చూపిం చలేకపో తే, లేదా అనుచరులు తన ఆదేశాలను అమలు చేసేట్లుగా శాసించగలిగిన సామ ర్ధ్యం లేకపోతే అనుచరులు పాడైపోయిన పిల్లల్లాగా తయారవుతారంటాడు, ‘సంట్జ్: ది ఆర్డర్ ఆఫ్ వార్’. అలాంటి అనుచరులు ఎలాంటి విజయాలనూ పొందలేరు. నిజానికి అనుక్షణం మనలో కలిగే ఆలోచనలు మాటల రూపాన్ని పొందుతాయి.

మనం మాట్లాడే మాటలే క్రియా రూపాన్ని తాలుస్తాయి. మనం చేసే పను లు మన అలవాటుగా మారుతాయి. మ నం స్పందించే అలవాట్లు మన శీలంగా మారుతాయి. మన శీలమే మన ప్రకృతిగా మారుతుంది. అందుకే నిరంతరం శిక్షణలో భాగంగా కఠినంగా వ్యవహరించ డమే ఉత్తమం. రెండోతరం నాయకులుగా ఎలాంటి నాయకత్వాన్ని (ఉదాత్తమైన, వ్యూహాత్మక, బానిస నాయకత్వం) కోరుకుంటున్నామో.. తదనుగుణమైన ఆలోచ నలను చేయడం, శిక్షణనందివ్వడం మాత్ర మే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.