11 May, 2026 | 4:02 AM

రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది

11-05-2026 02:40 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

బీజేపీ బహిరంగ సభలో ప్రజల ఉత్సా హం చూస్తుంటే తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నా రు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నా రు. ఇది కార్యకర్తల సభ అని, తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి  మోదీకి ఘన స్వాగతం పలికారని తెలిపారు.  మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన  మోదీకి రాష్ట్ర ప్రజలు అద్భుత స్వాగతం పలకడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మోదీకి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు.

హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 తేదీనే మోదీ జన్మదినం కూడా కావడం విశేషమన్నారు. తెలంగాణతో పాటు దేశ అ భివృద్ధికి దోహదపడే రూ .9,700 కోట్ల వి లువైన ప్రాజెక్టులను మోదీ దేశానికి అంకితం చేయడం పట్ల తెలంగాణ బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే శక్తులపై పోరాటంగా అభివర్ణించారు. 

ఒకప్పుడు దేశాన్ని నక్సలిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌స్ట్రీమిజం వంటి శక్తులు భయపెట్టాయని, కానీ మోదీ నాయకత్వంలో దేశం నక్సలైట్ ముక్త్ భారత్, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌స్ట్రీమిజం ముక్త్ భారత్ దిశగా ముందుకు వెళ్తుందన్నారు. దక్షిణాది,-ఉత్తరాది పేరుతో దేశాన్ని విభజించే రాజకీయ శక్తులతో పాటు కుటుంబ పాలన పేరుతో దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ వంటి పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తోందన్నారు. మోదీ సంకల్పాన్ని, అభివృద్ధి సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని రాష్ట్ర ప్ర జలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.