6 June, 2026 | 11:14 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

మా సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు

06-06-2026 12:00 AM

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిం చారు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవు తోంది. ఈ సందర్భంగా ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ పేరుతో మేకర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత వెంకట సతీశ్ కిలారు మాట్లాడుతూ.. “పెద్ది’ చిత్రం తొలిరోజే రూ.135 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఇది రామ్‌చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా. ఈ సినిమాను ప్రేక్షకులు చాలా దూరం తీసుకెళ్లారు. అందరూ సినిమాను నమ్మి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. టికెట్ రేట్ల విషయంలో మాకు సహకరిం చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ కూడా మాట్లాడారు.