6 June, 2026 | 11:16 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

నాగచైతన్య నిర్మాతగా దూత 2

06-06-2026 12:00 AM

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘దూత’తో ఓటీటీలో అరంగేట్రం చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ సీక్వెల్ రానుంది. దీనికోసం నాగచైతన్య నిర్మాతగానూ మారుతున్నారు. శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కే కుమా ర్ రెండో సీజన్‌కు దర్శకత్వం వహించనున్నారు.

ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరా బాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగా ర్జున అక్కినేని క్లాప్ కొట్టి, స్క్రిప్టును చిత్రబృందానికి అందజేశారు. ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాలో హీరోగా నటిస్తున్న నాగచైతన్య తన తదుపరి ప్రధాన ప్రాజెక్టుగా ‘దూత 2’ను ఎంచుకోవడం విశేషం. ఈ రెండో సీజన్‌ను దర్శకుడు విక్రమ్ కే కుమార్..

మొదటి సీజన్‌ను మించిన స్థాయిలో సస్పెన్స్, సైకాలజికల్ థ్రిల్స్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నారు. ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు డీవోపీ: ముఖేశ్వరన్; సంగీతం: ఈషాన్ ఛాబ్రా; ప్రొడక్షన్ డిజైనర్: ప్రవళ్య డీ; నిర్మాతలు: నాగచైతన్య, శరత్ మరార్; రచన, దర్శకత్వం: విక్రమ్ కే కుమార్.