24 March, 2026 | 4:30 PM

బీజేపీ నాయకుల అరెస్టు అప్రజాస్వామ్యం

24-03-2026 12:00 AM

మాగనూరు మార్చ్ 23. బిజెపి రాష్ట్ర పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బిజెపి నాయకులు తరలి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామీకమనీ బిజెపి మండల అధ్యక్షుడు జయ నంద రెడ్డి ఖండించారు. సోమవారం మండల పరిధిలోని ఆ యా గ్రామాల్లో బిజెపి నాయకులను చలో అసెంబ్లీ ముట్టడి కి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి బ్రష్టు పట్టి ప్రజలు బతకలేక ఆగం చేస్తూ బాని భావితరాలకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలు దౌర్జన్యాల తో పరిపాలన సాగిస్తుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, కనకరాజు, బిజెపి నాయకులు తదితరులు.

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

శ్రీరంగాపూర్, మార్చి 23: రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరుకాకుండా స్థానిక బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆరోపిస్తూ, వాటిపై నిరసన వ్యక్తం చేసేందుకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరే నాయకులను ముందుగానే అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అరెస్టు అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు నలవోతుల విష్ణువర్ధన్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి సిట్టి రాజుల శివ, మండల సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ నాయుడు, సీనియర్ నాయకుడు జానీ, గుంటి శివ, హెచ్.కె. రాజేష్, నవీన్ ఉన్నారు.బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందస్తు అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రజల తరఫున తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.