30 March, 2026 | 2:40 AM

వ్యవసాయ రంగాన్ని రక్షించాలి

30-03-2026 01:01 AM

మహబూబాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం రైతాంగం సమిష్టిపోరుకు సిద్ధం కావాలని ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ మహబూబాబాద్ జిల్లా సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో వ్యవసాయక విప్లవానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఏప్రిల్, మే, జూన్ నెలలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర మహాసభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తూ రైతాంగాన్ని సంఘటిత ఉద్యమానికి సిద్ధం చేస్తుందన్నారు. సెప్టెంబర్ నెలలో ఖమ్మం పట్టణంలో జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నామని ఈ అన్ని సభలలో రైతాంగం కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని అన్ని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

విదేశీ సంస్థలతో సహా కార్పోరేట్ లాభాలను పెంచుకోవడానికి రై తాంగాన్ని వారి జీవనాధారాలను కేవలం అనుబంధాలుగా వనరులుగా మార్చి బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రతరం చేస్తోందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్యారెంటీ 2005 చట్టం స్థానంలో తీసుకు వస్తున్న బి.వి రాంజీ చట్టాన్ని జిల్లా కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానించింది. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మోకాళ్ళ మురళీకృష్ణ, జీ.సద్గురు, గుజ్జు దేవేందర్, షేకు బాబన్న, ఊడుగుల లింగన్న, బట్టు నాగేశ్వరరావు,గజ్జి లింగన్న, కొమురెల్లి సోమిరెడ్డి, జంగిలి సోమనరసన్న, చింతా వెంకన్న, తోకల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.