calender_icon.png 7 February, 2026 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అగ్ని-3’ పరీక్ష విజయవంతం

07-02-2026 12:15:28 AM

భారత్ అమ్ములపొదిలో మరో క్షిపణి

క్షిపణికి ౩ వేల కిలోమీటర్ల సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే శక్తి

భువనేశ్వర్, ఫిబ్రవరి ౬: భారత రక్షణ రంగ వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ‘అగ్ని--3’ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఇంటర్మీడియట్ రేంజ్ బా లిస్టిక్ క్షిపణి సుమారు 3,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ఇప్పటికే దేశ అమ్ములపొదిలో ఉన్న ‘అగ్ని--1’ 700 కి.మీ మేర, ‘అగ్ని-2’   2,000 కి.మీ మేర, ‘అగ్ని-4’ 4,000 కి.మీ ‘అగ్ని-5’ 5,000 కి.మీ సుదూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు ఉండగా, వీటి సరసన తా జాగా అగ్ని-౩ చేరింది. కేవలం అగ్ని సిరీస్ మాత్రమే కాకుండా, బ్రహ్మోస్ వంటి టాక్టికల్ క్రూయిజ్ క్షిపణులు కూడా భారత సై న్యం బలాన్ని పెంచుతున్నాయి.

30- 300 కిమీ లోపు లక్ష్యాలను బ్రహ్మోస్ చూసుకుం టే, అంతకు మించిన దూరంలోని లక్ష్యాలను అగ్ని క్షిపణులు ఛేదిస్తాయి. అగ్ని--3 కూడా భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రయోగం విజయవంతంపై ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.