2 July, 2026 | 12:06 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

చెవి కొరికేసాడు

21-03-2026 01:58 AM

గొడవలో తల దూర్చాడని ఆగ్రహానికి గురైన వ్యక్తి చర్య

మహబూబాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): గొడవలో తల దూర్చాడని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి.. బాధిత వ్యక్తి చెవి కొరికిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూరు మండలం అవుతాపురంలో జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన జోగు సతీష్ అనే వ్యక్తి అవుతాపురం గ్రామానికి చెందిన ముగ్గురితో గొడవ పడుతున్నాడు. అదే గ్రామానికి చెందిన బందు శశి కుమార్, గద్దల రోహిత్, చెడుపాక సాంబశివ అనే ముగ్గురు అక్కడికి వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు.

దీనికి ఆగ్రహించిన సతీష్.. బందు శశి కుమార్ చెవిని నోటితో గట్టిగా కొరకడంతో చెవి భాగం కొంత ఊడి పడిపోయింది. గాయపడ్డ శశికుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు వెంకన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా పెద్ద వంగర ఎస్సు చిలువేరి ప్రమోద్ కుమార్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు దర్యాప్తు చేపట్టారు.