పాలకేంద్రం రైతు సొసైటీ చాముండి టెంపుల్ లెక్కలు బహిర్గతం చేయాలి
- మూడు ప్రభుత్వ ఆఫీసుల్లో లక్షల అవినీతి జరిగింది
- ప్రాణ రక్షణ కోసం ఎస్పీని కలుస్తా
దోమకొండ జూలై 7 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పాత కాలుక కేంద్రమైన దోమకొండలో మూకుమ్మడిగా 200 మంది రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు గ్రామపంచా యతీకి చేరుకొని బాధ్యతగల సర్పంచు ను దూషిస్తూ నిలదీయడం సమంజసం కాదని దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య అన్నారు. గ్రామపంచాయతీ లోని తన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో, మహిళ సభ్యుల భర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు తెలియకుండానే గ్రామపంచాయతీకి 200 మంది రెడ్డి కులస్తులు చేరుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల ఆయన తప్పు పట్టారు. రెడ్డిలను గ్రామంలో రెడ్డిలు ప్రచారం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
దోమ కొండ సింగిల్ విండో చైర్మన్ పన్యాల నాగరాజు రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా రైతులకు చెందిన లావాదేవీలను రుణ వసూళ్లను రుణ మంజూరులను ఇతర కార్యక్రమాలను లెక్కలను చూపడం లేదని దోమకొండ సర్పంచ్ నరసయ్య ఆరోపించారు. దోమకొండ పాలకేంద్రం చైర్మన్ మందుగుల నరేష్ పాడి రైతులకు పాల కేంద్రం ఆదాయ వ్యయాలు ఖర్చులు లెక్కలను చూపాలని, దేవాదాయ శాఖకు చెందిన చాముండేశ్వరి ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి గుడి లెక్కలను ప్రజలకు వివరించాలని కోరానని సర్పంచ్ తెలిపారు.
తాను సర్పంచ్ గా గ్రామస్తులు అందరికీ సేవలు అందిస్తానని కానీ ఒక వర్గానికి చెందిన వారు తన విధులకు ఆటంకం కలిగిస్తూ దోమకొండ గ్రామంలో అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తూ సర్పంచి తో పాటు గ్రామపంచాయతీని దుష్ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలసి దోమకొండ గ్రామపంచాయతీలో జరిగిన సంఘటనను వివరించి తన భద్రత కోసం వినతి పత్రం అందజేస్తానని సర్పంచ్ తెలిపారు. తాను నిన్న, మొన్న రాజకీయాల్లోకి రాలేదని 35 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఉండడం వల్లనే ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని, దోమకొండ సర్పంచిగా మరోమారు గెలిపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.






