1 August, 2026 | 7:28 PM

వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి

01-08-2026 06:24 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పుట్టినరోజును పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం కు చెందిన  ప్రముఖ వ్యాపారవేత్త తాటిపల్లి భూపతి శనివారం మానసిక వికలాంగులకు అన్నదానం, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు, మానసిక వికలాంగుల మధ్య  వేడుకలు జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది భూపతి అన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ... మా మధ్య పుట్టినరోజు జరుపుకొని మాకు భోజనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్  మాట్లాడుతూ... అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని,  పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా తాటిపల్లి భూపతి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెళ్లి భాస్కర్, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్, శివనాత్రి ప్రసాద్,  రమేష్, జర్నలిస్టులు కత్తర్ల చందర్, ముంజ శ్రీనివాస్, పెగడ మధు, బోయిరి అశోక్,   స్నేహితులు నందాల శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.