1 August, 2026 | 7:56 PM

ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

01-08-2026 06:46 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): నేటి సమాజాన్ని బట్టి విద్యార్థిని, విద్యార్థులు ఎంతో అప్రమత్తంగా ఉండి ఆలోచనతో ముందుకు వెళ్లాలని, నేరేడుచర్ల కళాశాల ప్రిన్సిపల్ పి నీరజ అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఎన్ఎస్ఎస్, స్టూడెంట్ కౌన్సిలర్ గణేష్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సెంట్రల్ అడ్మిన్ హేమలత, సఖి విభాగం శైలజ, మహిళా సాధికారత విభాగం  రేవతిలు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులకు, మహిళలు, చైల్డ్ ట్రాప్పింగ్, యాంటీ డ్రగ్స్, పోక్సో యాక్ట్  గురించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ లు అదేవిదంగా బాల్య వివాహ నిరోధక చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని దానిని సరైన మార్గంలో తీర్చిదిద్దుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని లేని పక్షంలో జీవితం అంధకారంలోకి మారే ప్రమాదం ఉందని ఆయా చట్టాలు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు వెంకటరమణ, సైదులు, నరసింహారావు మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.