1 August, 2026 | 7:43 PM

తాత్కాలికంగా కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి

01-08-2026 07:02 PM

* చేర్యాలలో రోడ్లపై స్థానికుల డిమాండ్

* క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

చేర్యాల: చేర్యాల పట్టణంలోని పెద్దమ్మ గడ్డ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లపై మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ నాగేందర్ ఆదేశాలతో సిబ్బంది అక్కడ తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చివేశారు. కమిషనర్ నాగేందర్ స్వయంగా వెళ్లి పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. గుంతలు పూడ్చడంతో వాహనదారులకు, స్థానికులకు రాకపోకల్లో తాత్కాలిక ఇబ్బందులు తొలగాయి.అయితే ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులు చేయడం కాదని, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.