ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా
01-08-2026 07:23 PM
ఒక రోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటూ కోర్టు ఆదేశం
మహేశ్వరం,(విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రాట్లావత్ మల్లేష్ పై మహేశ్వరం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసారు. అంతరం ఇబ్రహీంపట్నంలోని న్యాయ స్థానం మేజిస్ట్రేట్ సుజాత ముందు అజరుపర్చగా అతనిని విచారించిన అనంతరం రాట్లావత్ మల్లేష్‌కు 6 వేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు ఒక రోజు పాటు మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించించారు. ఈ సందర్భంగా మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






