1 August, 2026 | 8:17 PM

మైనారిటీ ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి పరిశీలన.

01-08-2026 07:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నెలకొన్న మైనారిటీల సమస్యలను ప్రత్యేక అధికారి కలీం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాలలోని విద్యార్థుల వసతుల కల్పన కోసం అవసరమైన తరగతి గదుల విషయమై ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. అంతేగాక కబ్రిస్తాన్ కమ్యూనిటీ హాల్ సామూహిక మరుగుదొడ్లు ఈద్గా కాంపౌండ్ వాల్ బ్రిడ్జి నిర్మాణంపైన మైనార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ వార్డు సభ్యులు షేక్ షాకీర్లు ఉన్నారు.