6 నుంచి బీ-ఆర్క్ కౌన్సెలింగ్
01-07-2026 12:00 AM
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): బీ-ఆర్కిటెక్చర్ కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై 6 నుంచి నిర్వహించనున్నారు. 3న షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ డీ షర్మిల పేర్కొన్నారు. 6 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా, ధ్రువపత్రాల పరిశీలన 23న, తొలివిడత సీట్లను ఆగస్టు 12న కేటాయించనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ షర్మిల స్పష్టం చేశారు.






