అందుకే ముందు సెకండాఫ్ షూట్ చేశాం!
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా, దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్‌కుమార్ బన్సాల్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకునేందుకు దర్శకురాలు మానస శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నేను మొదట యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశా. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పనిచేశా. ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌నూ రూపొందించా. ‘రాకాస’ నాకు నాలుగో ప్రాజెక్ట్.
‘రాకాస’ను ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్‌లో తీశాం. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తీశాం.
‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది.
ఈ కథను ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పా. ఆ టైమ్‌లోనే ఈ కథను విన్న సంగీత్‌కు కూడా చాలా నచ్చింది. అలా ఆయన ఈ ప్రాజెక్టులోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం.
నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పనిచేసి ఉన్నా. ఆమె టాలెంట్ చూసే తీసుకున్నాం.
నిహారిక మంచి నిర్మాత. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు. అం దుకే పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు.
‘రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ జరుగుతుంటే.. ఫస్ట్ హాఫ్ షూట్ చేయడం వల్ల టైమ్ కలిసి వచ్చింది.
వెబ్ సిరీస్‌కు, సినిమాకు ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది.. రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు.
ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా ప్రధానంగా హాస్యం, వినోదం ఉండేలా చూసుకుంటా. ‘రాకాస’ తర్వాత వాటి గురించి చెప్తా.




