25 June, 2026 | 1:17 AM

సర్దార్ 2 వచ్చేది అప్పుడే

25-06-2026 12:08 AM

హీరో కార్తి ప్రస్తుతం ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ప్రీక్వెల్‌కు డైరెక్షన్ చేసిన పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది.

ఈ చిత్రం సెప్టెంబర్ 10న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అగ్నిపర్వతంలా ఎగిసిపడుతున్న పేలుడు నేపథ్యంలో చేతిలో తుపాకీతో ధైర్యంగా నిలబడ్డ హీరో లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా ఎస్‌జే సూర్య ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: సామ్ సీఎస్; డీవోపీ: జార్జ్ సీ విలియమ్స్.