‘సహ’ వచ్చేది అప్పుడే
23-08-2026 12:36 AM
శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘సహ’. ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ట్యాగ్‌లైన్. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్.. నాయకానాయికలు శివకుమార్, శ్వేతా లక్ష్మణ్‌ల మధ్య సహజ ప్రేమను ఆవిష్కరి స్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: కరుణాకర్ కే; సంగీతం: శేఖర్ చంద్ర; ఎడిటర్: దినేశ్ పెద్ది.






