తైబజార్ వేలం పాట..
28-03-2026 07:47 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): 2026-27 సంవత్సరానికి గాను శనివారం మునిసిపల్ కార్యాలయంలో తైబజార్ వేలం పాట నిర్వహించారు. పసుల వెంకటస్వామి రూ. 13,50,000 ఎక్కువ పాట పాడి కూరగాయల సoతను( తై బజారు) దక్కించుకున్నారు. వేలం పాటలో నలుగురు పాల్గొన్నారు. ఇందులో వెంకటస్వామి ఎక్కువ పాడి సంతను వశం చేసుకున్నారు. తైబజారు వేలం పాట నిర్వహించినట్టు మునిసిపల్ కమిషనర్ జే. సంపత్ రెడ్డి తెలిపారు. నూతన తైబజారు కాలపరిమితి ఏడాది కాలం ఉంటుందని ఆయన తెలిపారు.




