28 March, 2026 | 9:53 PM

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్, సిఐ

28-03-2026 08:05 PM

మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తహసిల్దార్ వెంకన్న, సిఐ రామకృష్ణ రెడ్డి, శనివారం  తనిఖీ చేశారు. పదవ తరగతి  పరీక్ష వ్రాస్తున్న విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాల పై  పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. విద్యార్ధుల ఆరోగ్య , భద్రత దృష్ట్యా, వైద్య సిబ్బంది, అవసరమైన  మెడిషన్ ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీప్ సూపర్డెంట్ బాసిత్, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది నాగయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది సంతోష్ సింగ్, తదితరులు ఉన్నారు.