29 March, 2026 | 9:04 PM

ఉగాది జాతర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసులకు ఘన సన్మానం

28-03-2026 09:15 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉగాది పండగ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో గల నల్లపోచమ్మ ఆలయం వద్ద మూడు రోజులపాటు నిర్వహించిన నల్లపోచమ్మ జాతర మహోత్సవం కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా జాతర జరిగేటట్లు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తుల ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు నిర్వహించిన నాగిరెడ్డిపేట్ మండల పోలీస్ శాఖను స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ను, సిబ్బందిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా సన్మానాలు అభినందనలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఇలాంటి పోలీసులు ఉంటే నల్ల పోచమ్మ జాతరనే కాకుండా ఏడుపాయల జాతరవంటి పెద్ద పెద్ద జాతర్లను కూడా ధీమాతో జరుపుకోవచ్చునని తెలిపారు.గతంలో జరిగినటువంటి నల్లపోచమ్మ జాతర మహోత్సవంలో ఎంతోమంది దూరప్రాంతాల నుండి భక్తులు,జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చి నల్ల పోచమ్మ అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎంతో కొంత మంది ప్రాణాలను కోల్పోయారు.ఇప్పుడు కూడా అదే మాదిరిగా పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు జాతరకు తరలివచ్చి తిలకించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

కానీ గతంలో జాతర మహోత్సవంలో దురదృష్టంశాతు ఎంతోమంది పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ వద్ద స్నానాలకు వెళ్లి భక్తులు ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఇప్పుడు ఈ ఉగాది జాతర మహోత్సవంలో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదని దీనికి అంత కారణం గొప్పతనం స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే దీనికి నిదర్శనమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు గుర్రాల సిద్దయ్య,వెంకట్ రెడ్డి,హనుమాన్లు, వంశీకృష్ణ గౌడ్,హనుమంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.