28 March, 2026 | 11:32 PM

రాజీ మార్గమే... రాజ మార్గం: జడ్జి ఎండి గౌస్ పాషా

28-03-2026 09:43 PM

తుంగతుర్తి: రాజీ మార్గమే రాజ మార్గమని, ఒక కేసులో రాజీ పడటం వల్ల ఇరువర్గాలు ఆ కేసులో గెలిచినట్లే అని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎండి.గౌస్ పాషా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ లో పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమస్యలు పరిష్కరించుకొని స్నేహంగా ఉండాలన్నారు.

ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఉందని, వాటికి భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించవద్దని తెలిపారు. మొత్తం లోక్ అదాలకు 106 దరఖాస్తులు ఇందులో 54 దరఖాస్తులు కక్షిదారులు రాజీపడగా52 కేసుల్లో 4,50,000 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుమారు 435 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.