28 March, 2026 | 11:02 PM

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

28-03-2026 09:24 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండలంలోని తునికి పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు సంప్రదాయ బోనాలు సమర్పించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, మహమ్మద్ నగర్ మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నిజాంసాగర్ ఎస్సై జె.శివకుమార్, గ్రామ సర్పంచ్ కుమ్మరి రాములు, ఉప సర్పంచ్ భీమన్ పల్లి శంకర్ పాల్గొన్నారు.