28 March, 2026 | 11:07 PM

ప్రకాశ్ రావు నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని వినతి

28-03-2026 09:27 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం డివిజన్ అన్నోజిగూడ పరిధిలోని డాక్టర్ ప్రకాశ్ రావు నగర్ కాలలోని డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల అయ్యే విధంగా కృషి చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవకు శనివారం మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని డాక్టర్ ప్రకాష్ రావు నగర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, కమ్యూనిటీ భవనం, పార్కులేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, మంజూరైన 80 మీటర్ల రోడ్డును సహితం 40 మీటర్లే వేస్తామని అధికారులు అంటున్నారని, ఇట్టి సమస్యలపై స్పందించి ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసే విధంగా కృషి చేయాలని స్థానిక మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ కోరారు.