28 March, 2026 | 9:42 PM

పాండురంగ విట్టలేశ్వర ఆలయ నిర్మాణ స్లాబ్ ప్రారంభం

28-03-2026 07:42 PM

- పాండురంగ విట్టలేశ్వర ఆలయ నిర్మాణం

- శ్రమదానం, ఆర్థిక సహాయంతో ముందుకు వచ్చిన గ్రామస్థులు

పెద్ద కొడప్‌గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో పాండురంగ విట్టలేశ్వర ఆలయ నిర్మాణంలో కీలక ఘట్టంగా స్లాబ్ పనులను శనివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని భక్తులు, దాతల సహకారం, విరాళాలతో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంతులు సహాయంతో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి స్లాబ్ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణం చేపట్టడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతోందని స్థానికులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థికంగా, శ్రమదానంగా సహకరిస్తుండటం విశేషం. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో పాండురంగ విట్టలేశ్వర ఆలయం ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.