28 March, 2026 | 11:07 PM

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయి

28-03-2026 09:20 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి దోహదపడతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. మండల కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతి ప్రధానం చేశారు. ప్రధమ విజేతగా బెంగాల్ టైగర్స్ (తౌహిద్) రూ.20 వేలు ప్లస్ ట్రోఫీ  అలాగే ద్వితీయ బహుమతి ఆరిఫ్ అలవెన్స్ రూ.12 వేలు ప్లస్ షిల్లును వైరా పాషా స్పాన్సర్ చేశారు.

అలాగే అలాగే టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక ప్రతిభ కనబరిచిన కడప నవీన్ కు వేల సిరీస్ అవార్డులను ప్రధానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని  క్రీడలు ఆటగాళ్ల మధ్య మాత్రమే కాదు, దేశాల మధ్య, సంస్కృతుల మధ్య అంతరాలను తొలగిస్తాయన్నారు. క్రీడల్లో సహకారం, సమన్వయం, దృఢ నిశ్చయం, సహనం వంటి లక్షణాలు పెంపొందుతాయన్నారు.

వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య స్నేహ బంధాలను పెంపొందించడానికి సహాయపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ హఫీజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య సర్పంచ్ వజ్జా ఉమా ఆళ్లపల్లి ఉపసర్పంచ్ సయ్యద్ ఆరిఫ్ సిపిఐ నాయకులు వచ్చా పగడయ్య  రాంబాబు చిరంజీవి మేనేజ్మెంట్ ముక్తియార్ ఖయ్యూం ఫయీం తౌహీద్ ఆరిఫ్ కాలిద్ సమీర్ నవీన్ అడప సాయి చింటూ సల్మాన్ అడ్డు అబ్బాస్ వినోద్ ప్రణయ్ హనీఫ్ రహీం తేజ స్టాలిన్ ఖదీర్ మతిన్ నదీమ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.