బస్సు పాసుల కోసం దరఖాస్తు చేసుకోండి
భైంసా,( విజయక్రాంతి): విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో టీజీ ఆర్టీసీ బస్ పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. 12 సం!! రాల లోపు ఉన్న బాలురకు స్వంత గ్రామం నుండి పాఠశాలకు 20 కి.మీ. లోపు దూరంలో ఉంటే ఉచిత బస్ పాస్ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. హై స్కూల్ బాలురు 35% రాయితీ తో కూడిన బస్ పాస్ పొందవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పీజులు ఉండవని, ప్రయివేట్ పాఠశాలలు మరియు కళాశాల యాజమాన్యం టి. జి.ఎస్.ఆర్టీసీకి అడ్మినిస్ట్రేషన్ పీస్ డి.డి. రూపంలో అకౌంట్ ఆపీసర్ టీజీఎస్ఆర్టీసీ ఆదిలాబాద్ పేరు పైన తీయవలసి వస్తుందని డిపోమేనేజర్ తెలిపారు.
పాఠశాలల యాజమాన్యం
పాఠశాలలో మొత్తం విద్యార్థులు 500 కు పైగా ఉంటే కొత్తగా అయితే 2000/- రూ!! లు రీనివల్ అయితే 1000/- రూ!! లు డి. డి. రూపంలో చెల్లించవలసి ఉంటుంది.అలాగే జూనియర్ కళాశాల, వొకెషనల్, ఐ.టి. ఐ.డిప్లొమా వారు అయితే కొత్తగా అయితే 5000/- రూ!! రీనివల్ 4000/- రూ!! లు ఉంటుందని, అలాగే డిగ్రీ వారు 6000/- రీనివల్ 5000/- ఇంజనీరింగ్, మెడిసిన్ వారు అయితే 7000/- రీనివల్ అయితే 6000/- ఉంటుందని ఇలా డి.డి. లు చెల్లించి నిర్మల్ బస్టాండ్ కు వచ్చి యుజర్ ఐ.డి. పాస్ వార్డ్ తీసుకుని విద్యార్థుల బస్ పాస్ లు ఆన్ లైన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.నిర్మల్ బస్ పాస్ కౌంటర్ ఉ!! 9 నుండి సాయంత్రం 6 గం!! ల వరకు మీకు సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు.






