పవన్ కళ్యాణ్ బీజేపీ నడిపిస్తున్న తోలుబొమ్మ
ఇది సినిమా కాదు.. సినిమా డైలాగులు మాట్లాడితే నడవదు
పవన్ కళ్యాణ్ కు మహేశ్ గౌడ్ కౌంటర్
పవన్ చిన్నవాడు.. రాజకీయాల్లో చాలా చేర్చుకోవాలి
హైదరాబాద్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ అన్నారు. తెలంగాణకు రావొద్దని పవన్ కళ్యాణ్ ను ఎవరూ ఆపడం లేదన్న మహేష్ గౌడ్ సినిమా నటుడిగా పవన్ వస్తే ఇంటికి పిలిచి భోజనం పెడతానని తెలిపారు. పవన్ చాలా చిన్నవాడు రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలని సూచించారు. బీజేపీ పలికించేవే పవన్ మాట్లాడుతున్నారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. ఇది సినిమా కాదు.. సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని పవన్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ చరిత్ర(Congress History) గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.






