రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యం గా వచ్చే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో 5,17,727 (రెగ్యలర్) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇందులో అబ్బా యిలు 2,60,916 మంది కాగా, బాలికలు 2,56,811 మంది ఉన్నారు. 10,512 ఫెయిల్ అయిన విద్యార్థులూ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు 2,07,573 మంది కాగా, ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులు 2,50,015 మంది ఉన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించా రు. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించారు.




