ప్రముఖుల ఆలయ సందర్శనలు
మహబూబాబాద్, విజయక్రాంతి : మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సందర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆయన తన సొంత గడ్డ మానుకోట జిల్లాలో పర్యటనకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు.
రామప్పలో ములుగు జిల్లా కలెక్టర్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సందర్శించారు. ఇటీవల బదిలీపై వచ్చిన కలెక్టర్ రామప్ప ఆలయంలో రామలింగేశ్వరుడిని దర్శించుకుని, ఆల య విశేషాలను అడిగి తెలుసుకున్నారు.






