మద్యం మత్తులో న్యూసెన్స్.. జరిమానా, ‘స్వచ్ఛ భారత్’ శిక్ష!
19-08-2026 01:54 AM
మేడిపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి) : మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్లకు చెందిన వై మహేందర్ (31),ఉదయ్ కిరణ్ (25), డి పాషా(32),వరప్రసాద్ (47), యాకయ్య (35) మద్యం సేవించి మేడిపల్లి ఏరియాలో న్యూసెన్స్ చేయడంతో పోలీసులు పెట్టి కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
వారిని ఎల్బీనగర్లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. ఒక్కొక్కరికి జరిమానాతో పాటు ’స్వచ్ఛ భారత్’ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిందితులు పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాల్లో ’ స్వచ్ఛ భారత్’ చేయడం జరిగింది.






