19 August, 2026 | 2:41 AM

ఆర్టీసీ ప్రత్యేక బస్సు రూట్ల క్రమబద్ధీకరణ

19-08-2026 01:54 AM
  1. కేబీఆర్ పార్క్ చుట్టూ మారిన ప్రయాణ మార్గాలు,బస్సు స్టాప్‌ల వివరాలు
  2. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వన్‌వే నిబంధనలు 

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్సు స్టాప్‌లు, స్టేజీల వివరాలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మారిన నిబంధనల మేరకు క్రింది ప్రధాన రూట్లలో బస్సు సర్వీసుల ప్రయాణ మార్గాలను క్రమబద్ధీకరించింది. రూట్ నం. 127కే: కొండాపూర్ -- కోఠి, 222ఏ: పటాన్‌చెరు- -కోఠి, 47ఎల్: మణికొండ-సికింద్రాబాద్/జేబీఎస్, 10హెచ్: కొండాపూర్-సికింద్రాబాద్. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే బస్సులు క్రింది మార్గం ద్వారా అందుబాటులో ఉంటాయి.

రూట్ నం. 47ఎల్ 

(సికింద్రాబాద్/జేబీఎస్  మణికొండ)

అప్ జర్నీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ):

సికింద్రాబాద్ నుంచి బేగంపేట, నాగార్జున సర్కిల్, ఎల్‌వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, ఫిల్మ్ నగర్, దర్గా మీదుగా మణికొండకు వెళ్తాయి.

డౌన్ జర్నీ (మణికొండ నుంచి సికింద్రాబాద్): మణికొండ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్ హాస్పిటల్, టీవీ9 (మసీద్), పంజాగుట్ట పీఎస్, ఆర్‌జే కాలేజీ, పోలీస్ లైన్, ప్లాజా మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.  

రూట్ నం. 10హెచ్: సికింద్రాబాద్ నుంచి- కొండాపూర్: సికింద్రాబాద్, బేగంపేట, మైత్రివనం, యూసఫ్ గూడ ఎక్స్ రోడ్స్, వెంకటగిరి, నవయుగా,పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీసు స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరుకుంటాయి.

డౌన్ జర్నీ 10హెచ్: కొండాపూర్ -నుంచి సికింద్రాబాద్: కొండాపూర్, పెద్దమ గుడి,జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి, యూసఫ్‌గూడ,  బేగంపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.

రూట్ నం. 222ఏ: కోఠి- పటాన్‌చెరు

కోఠి నుంచి లకడికపూల్, మసబ్ ట్యాంక్, నాగార్జున సర్కిల్, ఎల్‌వీప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పీఎస్ మీదుగా పటాన్ చెరు చేరుకుంటాయి.

డౌన్ జర్నీ రూట్ నం. 222ఏ: 

పటాన్‌చెరు- కోఠి పటాన్‌చెరు నుంచి మాదాపూర్ పీఎస్,పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్,అన్నపూర్ణ స్టూడియో, ఎల్‌వీ ప్రసాద్, నాగార్జున సర్కిల్, మాసబ్ ట్యాంక్, లకడికపుల్ మీదుగా కోఠి చేరుకుంటాయి.

రూట్ నం. 127కే:  కోఠి-కొండాపూర్

కోఠి నుంచి లకడికపూల్,మసబ్ ట్యాంక్, పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి, రోడ్డు నంబర్ 45, మాదాపూర్ పీఎస్ మీదుగా కొండాపూర్ చేరుకుంటాయి.డౌన్ జర్నీ రూట్ నం. 127కే: కొండాపూర్- కోఠి

కొండాపూర్ నుంచి మాదాపూర్ పీఎస్, రోడ్డు నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ,జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ,పెన్షన్ హౌస్, మాసబ్ ట్యాంక్ మీదుగా కోఠి చేరుకుంటాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు  మారిన బస్సు రూట్లను, స్టాప్లను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను నడిపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.