13 May, 2026 | 1:13 AM

సేంద్రియ సాగు.. లాభాలు బాగు

13-05-2026 12:06 AM
  1. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి 
  2. సేంద్రియ ఎరువులకు పెరుగుతున్న డిమాండ్ 

వాంకిడి, మే 12(విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల్లో కూడా పంట సాగు విధానంలో మార్పులు వస్తున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే దిశగా వాంకిడి మండల రైతులు ముందడుగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది. ఖరీఫ్ పంటల సాగులో సేంద్రీయ ఎరువులు వాడేందుకు అన్నదాతలు ఇష్టపడుతున్నారు.

రసాయనిక ఎరువులతో భారం రసాయనిక ఎరువుల ధ రలు మార్కెట్ లో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువుల కొనుగోలువు రైతులు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.దీంతో పెట్టుబడి భారం పెరిగి అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. రసాయ నిక ఎరువులు వాడకం వల్ల చీడపీడలు సోకి పంట దిగుబడి తగ్గిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. 

*భూసారం పెంపు దిశగా రైతు..

రసాయనిక ఎరువుల ద్వారా కలుగుతున్న అనార్థాలపై రైతుల్లో చైతన్యం వచ్చింది. దీంతో భూసారాన్ని పెంపొందించుకునే దిశగా మండల రైతులు ముందుకెళ్తున్నారు. పశువుల పేడ, చెరువుల్లో ఎరుక్కుపోయిన రేగడి మట్టిని పొలాలకు తోలుతున్నారు. పాడి ఎరువుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. 

పశువుల ఎరువు వాడుతాను: చిన్ను(రైతు), రాజీవ్ నగర్, వాంకిడి 

సేంగా ఎరువుల వాడకంతో పంటల సాగులో ఖర్చు తక్కువ అవుతోంది.దిగుబడి కూడా లాభసాటిగా ఉంది.రసాయనిక ఎరువులు వాడకం వల్ల భూమి గట్టిపడి సత్తువ కోల్పోతుంది.పంటకు రోగాలు కూడా ఎక్కువ వస్తాయి.పశువుల పేడ వాడకంతో భూమి గుళ్లబారిఎక్కువ కాలం తక్కువ ఉంటోంది.రోగాలు తక్కువగా ఉండి అధిక పంట వస్తుంది.అందుకే ప్రతి ఏటా పశువుల ఎరువునే వాడుతా.

.సేంద్రీయంతో అనేక లాభాలు :గోపి కాంత్,మండల వ్యవసాయ అధికారి 

సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయి పశువుల పేడ, చెత్త తో కూడిన సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంట పొలాల్లో ఎక్కువ కాలం భూమిలో తేమ ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చీడ పురుగులు నశిస్తాయి. తెగుళ్లు కూడా తక్కువే. రైతులకు తక్కువ ఖర్చు అధిక దిగుబడి లభిస్తుంది.