13 May, 2026 | 1:14 AM

స్కానింగ్ సెంటర్ల తనిఖీ

13-05-2026 12:10 AM

మహబూబాబాద్, మే 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో స్కానింగ్ సెంటర్లలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్మల్ హాస్పిటల్, గణేష్ స్కానింగ్ సెంటర్, పద్మావతి హాస్పిటల్ సహా పలు ప్రైవేట్ డయా గ్నోస్టిక్ సెంటర్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిపిఎన్ డిటి చట్టం 1994 ప్రకారం స్కానింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి గర్భస్థ శిశువు లింగాన్ని స్కానింగ్ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ వెల్లడించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని స్కానింగ్ గదులు, వెయిటింగ్ హాళ్లలో ‘ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడుదు’ అనే బోర్డు తప్పనిసరిగా ప్రదర్శిం చాలన్నారు.

శిక్షణ పొందిన, సర్టిఫైడ్ రేడియాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ మాత్రమే గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయాలన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు ఫారం ఎఫ్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించాలని,అదే రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, బయో మెడికల్ వేస్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు, ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరి. అన్ని ధృవపత్రాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలన్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవలు, ఫీజుల వివరాలు తెలిపే బోర్డులను ప్రధానంగా ప్రదర్శించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం, లైసెన్సు రద్దు చేయడం, జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విరాజిత, డాక్టర్ జ్వలిత,  హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లోక్యా, మనోహర్ పాల్గొన్నారు.