ధర్మశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టాలి
ద్వారకా తిరుమల స్థపతి చిరంజీవి ఆదిత్య
మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ శంకుస్థాపన
హుజూర్ నగర్, ఆగస్టు 18: ధర్మశాస్త్రం ప్రకారం అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు తెలిపారు. పట్టణంలోని శివాలయం లో మంగళవారం అయ్యప్ప కమిటీ సమావేశం నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం నమూనా బ్లూ ప్రింట్ ను ద్వారకా తిరుమలకు చెందిన స్థపతి చిరంజీవి ఆది త్య, అరుణాచలం కు చెందిన స్వామీజీ భు వనేశ్వర్ గురూజీలు ఆలయ నిర్మాణ కమిటీకి అందజేశారు.
ఈ సమావేశంలో మున్సి పల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి కెప్టెన్ ఉత్తమ్, ఎమ్మెల్యే ప ద్మావతి రెడ్డి సహాయ సహకారాలతో అయ్య ప్ప ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శివాలయం పక్కన ఉన్న స్థలం అ య్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని వేద పండితులు తెలిపారని అన్నారు.భక్తుల సహకారంతో ఆలయాన్ని అత్యంత వైభవంగా అత్యాధునిక హంగులతో దేవాలయాన్ని నిర్మిస్తామన్నారు. భవి ష్యత్తు తరాల దృష్టిలో పెట్టుకొని ఆలయ ని ర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ఒకపక్క శివాలయం... మరో పక్క ముత్యాలమ్మ దే వాలయం... మధ్యలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేసుకోవడం ఎన్నో జ న్మల పుణ్యఫలం అని అన్నారు.అయ్యప్ప ఆలయ నిర్మాణ స్థలం ఎంతో ప్రాచుర్యం కలిగిందని వెల్లడించారు. వేద పండితుల సూచనలు, సలహాల,, ధర్మ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని నిర్మాణం చేసుకోవాలన్నారు. ఆలయ నిర్మాణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అన్నారు.
పట్టణంలో మరో ఆధ్యాత్మిక అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేసేందుకుఅన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మరొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించా లని సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో గజ్జి ప్రభాకర్, పోలిశెట్టి నరసింహరావు, పశ్య శ్రీనివాస్ రెడ్డి, కోట సూర్య ప్రకాష్ రావు, కోలా నాగేశ్వరరావు,తండు సైదారత్నం గౌడ్, ఓరుగంటి నాగేశ్వరరావు, కితా మల్లికార్జునరావు, సురేందర్ గురుస్వామి, అయ్యప్ప భక్తులు, నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






