19 August, 2026 | 3:39 AM

విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

19-08-2026 12:32 AM

మహబూబాబాద్, ఆగస్టు ౧౮ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి, విద్యా బోధన, హాస్టల్లో వసతి తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

మెనూ ప్రకారం నిర్ణీత సమయానికి వేడివేడిగా, నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని వంటశాల, డైనింగ్ హాల్, తాగునీటి ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆహార తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన దినుసులు మాత్రమే ఉపయోగించాలన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.