ఈనెల19 నుంచి 21 వరకు అగర్తలలో యూడీఆర్టీఐ శిక్షణా కార్యక్రమం
సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఫ్రొఫెసర్ పి. నర్సింగ్ రావు
ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): పట్టణాభి వృద్ధి పరిశోధన, శిక్షణ సంస్థ (యూ డీఆర్టీఐ) ఆధ్వర్యంలో త్రిపుర రాజధాని అగర్తలలో అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగు లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ నర్సింగ్ రావు ప్యారసాని తెలిపారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందికంటి సాయికుమార్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ నెల19 నుంచి 21 వరకు జరిగే కార్యక్రమంలో ఉద్యోగుల సామర్థ్య నిర్మాణం,
నైపుణ్యాభి వృద్ధి వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. యూడీఆర్టీఐ బృందంలో ప్రొఫెసర్ నర్సింగ్ రావుతో పాటు ఇంజనీర్ అజ్మీరా కృష్ణ, పి. సాయి కిరణ్ పాల్గొంటారు. మున్సిపల్ ఆదాయ అభివృద్ధి వ్యవస్థలపై ప్రొఫెసర్ నర్సింగ్ రావు, నీటి సరఫరానిర్వహణ వ్యవస్థలపై ఇంజనీర్ అజ్మీరా కృష్ణ శిక్షణ అందించనున్నారు. 2001లో హైదరాబాద్లో స్థాపించబడిన యూడీఆర్టీఐ ఇప్పటివరకు దేశంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు 75 శిక్షణా కార్యక్రమాలు నిర్వహిం చినట్లు ఆయన తెలిపారు.






