రవీంద్రభారతిలో 19న నటరాజ రామకృష్ణ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళా కృష్ణ
ముషీరాబాద్, ఆగస్టు18 (విజయక్రాంతి) : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో లోక ఆరట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 19న రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో నటరాజ రామకృష్ణ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా. కళాకృష్ణ తెలిపారు. మంగళవారం హైదర్గూడలోని ఎన్‌ఎస్‌ఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫెస్టివల్ బ్రోచర్ను డా. కళాకృష్ణ, ఫెస్టివల్ చైర్మన్ బీఆర్ విక్రమ్ కుమార్, ఫెస్టివల్ డైరెక్టర్ లోకా చంద్రశేఖర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీఆర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ డా. కళాకృష్ణ నేతృత్వంలో ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు. ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి స్వాతి సోమనాథ్ కు గురు నటరాజ రామకృష్ణ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు2026 అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే డా. పేరిణి కుమార్, కథక్ సంజయ్ జోషి, కూచిపూడి జ్వాలాముఖి పిన్న, గీత హజారే (మలేషియా), సంజయ్ వడపల్లి (హాంకాంగ్), హరిత కనగల, దేబాశ్రీ పట్నాయక్, పేరిణి సతీష్ తదితరులకు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ నేషనల్ అవారడ్స్2026 ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఫెస్టివల్లో డా. కళాకృష్ణ ఆంధ్రనాట్యం, చిత్ర సుకుమారన్ మోహినీయాట్టం, సిరాజుద్దీన్ పేరిణి నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, డా. ఏనుగు నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. పలురాష్ట్రాల నుంచి నాట్య గురువులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ సిడి ఎఫ్‌ఓ నేషనల్ సెక్రటరీ సాయి వెంకటేష్, సభ్యులు ఒడిస్సా జగపతి జన, డాక్టర్ సజని వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.






