వైభవంగా ఆలయ వార్షికోత్సవం
20-04-2026 12:10 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 19(విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపునగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 42వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా ముగిశా యి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయిం ట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆనంద్ రావు, సాయి కుమార్, నీరజ్, ఆలయ కమిటీ చైర్మన్ జి. దామోదర్, అధ్యక్షుడు సదానంద్, కమిటీ సభ్యులు రాజు, సుదర్శన్ రెడ్డి, సురేష్, అశోక్, జి.కృష్ణ కాంత్, గణేష్ బబ్బి పాల్గొన్నారు.






