6 May, 2026 | 8:57 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

తెలుగు నాట హవా

11-02-2026 01:42 AM

మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. రోషన్ కథానాయకుడిగా నటించిన ‘ఛాంపియన్’ సినిమాలో ఆయన సరసన కథానాయకిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి ప్రాజెక్టుతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయం, సహజ సిద్ధమైన నటనతో యువత మనసు దోచుకున్న అనస్వర.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారి, హవా సాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ హీరో సంగీత్ శోభన్ సరసన నటించేందుకు అనస్వర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘కుమారి 21ఎఫ్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రాబోతున్న సినీవర్గాల సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగీత్ శోభ న్, అనస్వర రాజన్‌ల క్రేజీ కాంబినేషన్ బిగ్‌స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందోననే ఆసక్తి సినీ ప్రియుల్లో అప్పుడే మొదలైంది. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.