6 May, 2026 | 8:07 PM

Breaking News

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •  

మెగాస్టార్ సినీ ప్రయాణానికి 47 ఏళ్లు

12-02-2026 01:54 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్.. మెగాస్టార్ చిరంజీవి. తాను మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చి బుధవారానికి ౪౭ ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియాలో భావోద్వేగపూర్వకంగా ఒక పోస్ట్ పెట్టారు. ‘సరిగ్గా 47 ఏళ్ల క్రితం 1979 ఫిబ్రవరి 11న సినీ ప్రయాణం ప్రారంభించాను. ఆ తొలి చిత్రం ’పునాది రాళ్లు’. ఆ రోజు నా అనుభవాలను మాటల్లో వర్ణించలేను.

అవన్నీ నిన్న మొన్న జరిగినట్లుగా, నా కళ్ల ముందు కదలాడుతున్నాయి. నాకు మొదటి అవకాశమిచ్చిన చిత్ర దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్, నిర్మాత క్రాంతి కుమార్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారి నన్ను నమ్మి మంచి అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహమే నా నట ప్రయాణానికి పునాది రాళ్లుగా నిలిచాయి. 47 ఏళ్ల నుంచి నన్ను ఆదరిస్తూ, ప్రేమిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ముగించారు. చిరంజీవి నటించిన మొదటి సినిమా ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ, మొదట విడుదలైన చిత్రం ‘ప్రాణం ఖరీదు’ (1978) కావడం గమనార్హం.