10 May, 2026 | 7:01 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఆసియా క్రీడల దిశగా తెలంగాణ సెయిలర్లు

06-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సరైన ప్రోత్సాహం, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని నిరూపిస్తున్నా రు. తెలంగాణకు చెందిన ఇద్దరు బాలికలు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన సురగాని ఈశ్వ, కొమ్మరవెల్లి లహరిలు సెయి లింగ్ క్రీడలో అద్భుతాలు సృష్టిస్తూ 2026 ఆసియా క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే దిశగా దూసుకెళ్తున్నారు.

యాదాద్రి-భువనగిరి జిల్లా, మోటకొండూర్ మండల మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాల(బాలికలు) విద్యార్థిని సురగాని ఈశ్వ(14) చదువుతోంది. లహరి (15) సికింద్రాబాద్లోని ఉద్భవ్ స్కూల్లో చదువుతోంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు తమ మెంటర్, కోచ్ సుహైమ్ షేక్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం లహరి ’స్కిప్పర్’ గా, ఈశ్వ ’క్రూ’ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.