3 August, 2026 | 2:57 AM

సామాజిక న్యాయమే లక్ష్యం

03-08-2026 12:23 AM

ఈనెల 6న రాష్ట్రస్థాయి సంకల్ప సభ

సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన భారీ సమావేశం

గజ్వేల్, ఆగస్టు 2: సామాజిక న్యాయం సాధన, అన్ని వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ నెల 6న హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ’సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ను నిర్వహించనుంది.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. శనివారం గజ్వేల్లోని పార్టీ కార్యాలయంలో సంకల్ప సభ పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి కొట్టాల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఆకాంక్షించిన సామాజిక న్యాయం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.

సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ఈ సంకల్ప సభ ద్వారా సామాజిక న్యాయం అమలుపై ప్రభుత్వ దృష్టికి ప్రజల అభిప్రాయాన్ని తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న సామాజిక తెలంగాణ నిర్మాణమే సభ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ వర్గాలకు చెందిన అనేక కులాల వారికి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచే రాజకీయ అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనే డిమాండ్తో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, మేధావులు, యువత, సామాజిక సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్,కుమార్,వెంకటేష్ ,అశోక్,కార్యకర్తలు  పాల్గొన్నారు.