calender_icon.png 12 February, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

12-02-2026 05:25:15 PM

హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రైవేటు అధ్యాపకులకు, ప్రజా సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డా.సుందర్ రాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ, పీజీ కళాశాలలో టిఎల్ఎఫ్ రాష్ట్ర సలహా దారుడు వేణుమాధవ్ గౌడ్ తో కలిసి సుందర్ రాజు యాదవ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ లెక్చరర్స్ కు  హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 12 నెలల జీతం వచ్చేటట్టుగా ప్రత్యేకమైన చట్టం తేవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రైవేటు లెక్చరర్స్ కు అందించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ జేఏసీలో టిఎల్ఎఫ్ ముఖ్యపాత్ర పోషించి తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక పోసిందని అన్నారు. గంగాపురం వేణుమాధవ్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ లెక్చరర్స్ ఫోరం జయశంకర్ స్ఫూర్తితో,ఆయన మార్గదర్శనంలో ప్రారంభించబడింది.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఇటు అధ్యాపకులు ఇద్దరి మధ్యన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఒక అవగాహన కల్పించనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, దానికి అనుగుణంగానే తెలంగాణ జేఏసీ లో భాగమై,తెలంగాణ సాధనలో ముందుందన్నారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తరువాత రాజకీయ అంశాలు కావచ్చు, ఉద్యోగ అంశాలు కావచ్చు, ప్రతి అంశం మీద తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మునుముందు అధ్యయన వేదికగా మారి తెలంగాణ ప్రజలను మేల్కొల్పేందుకు పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గూడూరు సుమన్, కార్యదర్శి గుండేటి చక్రపాణి మహిళా అధ్యాపకులు ధనలక్ష్మి, అశ్విని, మహేశ్వరి, కృష్ణవేణి, రోజరమణి, చిన్మయి, ప్రణీత,సమత, కీర్తన గారు స్వప్న, వారితోపాటు అనురాధ, అలాగే నరేందర్,సంతోష్ కుమార్, సుప్రియ, అశోక్, నాగరాజు, సూర్యనారాయణ, ప్రవీణ్ కుమార్, పుల్ల శ్రీనివాస్, సంధ్య అగర్వాల్, జిన్నత్, శ్రీధర్, ప్రభాకర్, సంతోష్, కే శ్రీనివాసులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.