14 July, 2026 | 11:23 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ సభ

24-04-2026 12:39 AM

పోస్టర్ల ఆవిష్కరణ

దేవరకొండ, ఏప్రిల్ 23 : ఈ నెల 25న తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు గురువారం  దేవరకొండ పట్టణంలోని స్థానిక రహదారి బంగ్లాలో మేడ్చల్లో నిర్వహించే ఆవిర్భావ సభకు సంబంధించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం జాగృతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మన అశోక్ యాదవ్, ఎచ్చా శ్రీకాంత్, లకుమారపు మల్లయ్య మాట్లాడుతూ అమరుల ఆశయాలు, ఉద్యమకారు ల ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ప్రారంభించనున్న కొత్త రాజకీయ పార్టీకి మద్దతుగా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావా లన్నారు. యువకులు, మహిళలు, మేధావులు, కళాకారులు, కవులు అందరూ సభకు తరలిరావాలని, ప్రతి మండల కేంద్రం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజినీకాంత్ సభవత్ నిరంజన్,కే నిరంజన్,రామదాసు, గోపాల్, వెంకటేష్,తదిత రులు పాల్గొన్నారు.