24 April, 2026 | 2:06 AM

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

24-04-2026 12:37 AM

గరిడేపల్లి, ఏప్రిల్ 23: మండల కేంద్రమైన గరిడేపల్లి, పొనుగోడు జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను ఉపాధ్యాయుల పనితీరును ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేసి తరగతుల వారిగా కార్యక్రమాలను సంబంధిత కార్డులను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.అనంతరం ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న జన గణన కార్యక్రమం కోసం సూపర్వైజర్లు,ఎనిమినేటర్స్ కు అందిస్తున్న శిక్షణను ఆయన పరిశీలించి పలు సూచనలు అందించారు.

శిక్షణ పొందిన సూపర్వైజర్లు ఎనిమినేటర్లు చాలా జాగ్రత్తగా జనగణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన తెలిపారు.పొనుగోడు పాఠశాలలను మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు.మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ వారు పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సి ఆర్ పి రామకృష్ణ,సాయిలు, నాగరాజు, శోభారాణి, సునిలా రాణి, ఏ ఎస్ ఓ గోపి, ట్రైనర్లు దయాకర్, రవీందర్, ప్రధానోపాధ్యాయులు నరస కుమారి తదితరులు పాల్గొన్నారు.