1 March, 2026 | 5:14 AM

భవిష్యత్తు భారత్‌కు.. డీప్-టెక్ దిశానిర్దేశం

01-03-2026 01:34 AM

దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజ

సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థగా మారాలి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): విజ్ఞానం ప్రయోగశాలల గోడల మధ్యే పరిమితం కాకూడదని, పరిశోధన ప్రచురణల వరకే ఆగిపోకూడదని, ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు.

జాతీయ సైన్స్ డే సందర్భంగా రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన సస్టైనబుల్ భారత్ కోసం పరి శోధన, డీప్ టెక్నాలజీల జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్ ప్రస్తుతం కీలకమైన డీప్-టెక్ క్షణంలో నిలిచిందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ వ్యవస్థలు, వాతావరణ సాంకేతికతలు, ఆధునిక తయారీ, భౌగోళిక మేధస్సు వంటి రంగాల్లో జరుగుతున్న పురోగతులు రాబో యే దశాబ్దాల్లో దేశ పోటీతత్వాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు.

భారత్ నాటికి సాం కేతిక స్వావలంబన కలిగిన, పరిశోధన ప్రా ధాన్యమున్న, సుస్థిరత ఆధారిత దేశంగా ఎదగాలని, అది వినియోగం వల్ల కాదు, సృష్టి వల్లే శాశ్వత వృద్ధి సాధ్యమని అన్నారు. డీప్ టెక్నాలజీలు ఐచ్ఛికం కాదని, అవి జాతీయ పురోగతికి అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు పరిశోధనలో పెట్టుబడి పెట్టే దేశాలే రేపటి నాయకులవుతాయని పేర్కొన్నారు. పరిశ్రమలు వాస్తవ సమస్యలను గుర్తించాలని, అకాడెమియా మిషన్ మోడ్‌లో స్పందించి ప్రభుత్వం అనుకూల విధానాలను అమలుచేయాలన్నారు.

ఈ మూడు వర్గాల సమన్వయం వ్యవస్థీకృతంగా మారినప్పుడే ఆవిష్కరణ రూపాంతరం చెందుతుందన్నారు. తెలంగాణ దేశ ఆవిష్కరణ రంగంలో ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, ఔషధతయారీ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా ఎదిగిందన్నారు. పరిశోధనను వ్యా పారంగా మార్చే విధానాలు, స్టార్టప్లకు మద్దతు, ఉపాధి సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీల కర్మాగారాలుగా కాకుండా మేధో సంపత్తి, స్టార్టప్ ఇంక్యుబేషన్, సాంకేతిక వాణిజ్యీకరణకు కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు.

పరిపాలన కూడా విజ్ఞాన ఆధారంగా మారాలని అభిప్రాయపడ్డారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రజాసేవలను మెరుగుపరచాల్సిన అవసరమన్నారు. సస్టునబుల్ భారత్‌కు సమర్థవంతమైన, వాతావరణ స్పందన కలిగిన, డిజిటల్‌గా అనుసంధానమైన మౌలికవసతులు అవసరమన్నారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా ఉందని, అయితే పరిశోధన సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, ప్ర యోగసంస్కృతి పెంపొందితేనే అది జాతీయ శక్తిగా మారుతుందని తెలిపారు.