18 July, 2026 | 12:12 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

01-03-2026 01:32 AM

మదీనా బస్సు ప్రమాద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ‘ఈ ప్రభుత్వం మీది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.. మీకు అం డగా ఉంటాం’ అని అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుం బాలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో సీఎం రేవంత్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మదీనాలో ప్రమా ద ఘటన తెలుసుకున్న వెంటనే మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృం దాన్ని మదీనాకు పంపామని సీఎం గుర్తు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పిం చి మదీనా పంపించామన్నారు. అక్కడి భార త్ కాన్సులేట్, సౌదీ ప్రభుత్వంతో చర్చించి మృతిచెందిన వారి అంత్యక్రియలు జన్నుతుల్ బఖీలో చేయించామన్నారు.

సహజం గా దేశం బయట జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లిం చవని.. కానీ తాము మాత్రం మానవతా దృక్పథంతో సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల నాంపల్లి అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుం బాలకు పరిహారం చెల్లించామని సీఎం తెలిపారు. ఈ చెక్కులను ఇళ్లకు పంపించవచ్చ ని.. కానీ ‘మీ అందరితో కలవాలని... మీకు అండగా ఉంటామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సచివాలయానికి పిలిపించాం’ అని  సీఎం చెప్పారు.

అనంతరం ప్రమాదంలో మృతిచెందిన 44 కుటుంబాల వా రికి రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పు న చెక్కులను సనీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. ముస్లిం సోదరులతో తనకున్న అను బంధాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్ని కైన 2009 నుంచి నియోజకవర్గంలోని అ యిదు మండలాల నుంచి ఒకొక్కరి చొప్పున ఏటా అయిదుగురిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపుతున్నానని తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్యత స్థానిక ముస్లిం మత పెద్దలకే అప్పజెప్పానన్నారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకే షనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వైస్‌చైర్మన్ ఫహీం ఖురేషి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు  పాల్గొన్నారు.